ఖతార్‌కి విమానాల రద్దు
- June 05, 2017
ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలు ఖతార్‌కి వెళ్ళే తమ విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. ఖతార్ రాజధాని దోహా నుంచి వచ్చే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రెయిన్ - ఖతార్‌తో ట్రాన్స్‌పోర్టేషన్ లింక్స్‌ని తెగతెంపులు చేసుకున్న దరిమిలా విమాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎతిహాద్ అధికారిక ప్రతినిథి చెప్పిన వివరాల ప్రకారం అబుదాబీ - దోహా విమానం చివరిసారిగా జూన్ 6 ఉదయం 2.45 నిమిషాలకు డిపార్ట్ అయ్యిందనీ, దోహా - అబుదాబీ చివరి విమానం ఉదయం 4 గంటలకు అదే రోజు డిపార్ట్ అయ్యింది. ఎమిరేట్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ యూఏఈ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఎమిరేట్స్ తమ విమానాల్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణీకుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. ఈ రద్దుతో ఆర్థికంగా కొన్ని సమస్యలు తప్పవని వివిధ విమానయాన సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇంకో వైపున రానున్న రోజుల కోసం ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు, విమానయాన సంస్థల నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









