గుంటూరు నుండి గల్ఫ్ దేశాలకు సెక్స్‌ రాకెట్‌...

- June 06, 2017 , by Maagulf
గుంటూరు నుండి గల్ఫ్ దేశాలకు సెక్స్‌ రాకెట్‌...

గుంటూరు నుండి గల్ఫ్ దేశాలకు సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయ్యింది.నిరుపేద అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకుని గల్ఫ్‌కు తరలిస్తుందో ముఠా. వేలకు వేలు జీతం ఇచ్చే ఉద్యోగం అంటూ మభ్యపెట్టి.. అరబ్‌ దేశాల్లో మాత్రం క్లబ్ డ్యాన్సర్లుగా.. సెక్స్‌వర్కర్లుగా మార్చేస్తోంది. ఎంతోకాలంగా సాగుతున్న ఈ దందా.. ఇప్పుడు ఓ వ్యక్తి చొరవతో బయటపడింది.

నరసారావుపటేలోని పెద్దచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న కనకం బంధువు హరి.. చెన్నై నుంచి తరచూ వస్తుండేవాడు. అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. పెద్ద చెరువు ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలను ప్రలోభపెట్టాడు. అతని బుట్టలో పడిన దాదాపు 10 మంది అమ్మాయిలను నకిలీ సర్టిఫికెట్లు పెట్టి UAEకి పంపించాడు. ఇందులో చెన్నైకి చెందిన అస్కర్ అలీ కీలక పాత్ర పోషించాడు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పిన అతను.. తీరా అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత.. హోటళ్లు, పబ్‌లలో డ్యాన్సర్లుగా మార్చాడు. మరికొంతమంది మందిని సెక్స్ ముఠాలకు అప్పగించాడు. అప్పులు చేసి రావడం, అక్కడ ఆదుకునే వాళ్లు ఎవరూ లేకపోవడంతో.. గత్యంతరం లేక వారంతా.. అతడు చెప్పినట్లు చేయాల్సి వస్తోంది. తమకు ఇష్టం లేకపోయినా నరకాన్ని అనుభవిస్తున్నారు. 

ఇలా సెక్స్‌ ముఠాల చేతుల్లో చిక్కిన ఓ యువతి.. UAEలో పనిచేస్తున్న నరసరావుపేట వాసి  షరీఫ్‌కు పరిచయం అయ్యింది. తన బాధను చెప్పి.. కాపాడమని కోరుకుంది. ఆమెను వదలాలంటే.. డబ్బు కట్టాల్సిందేనంటూ కరాఖండీగా చెప్పారు వ్యభిచారముఠా నిర్వాహకులు. దీంతో.. స్నేహితులతో కలిసి కొంత డబ్బును చెల్లించిన తర్వాత వాళ్లు బెదిరింపులకు దిగారు. అమ్మాయిని విడుదల చేయమని.. ఎవరికైనా చెప్పుకోమని తెగేసి చెబుతున్నాడు బ్రోకర్ అలీ.  ఇక్కడి ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకుంటే తప్ప.. నరసరావుపేట అమ్మాయిలకు విముక్తి లభించదంటున్నాడు షరీఫ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com