ఆహార పదార్థాల కొరతలేదు: ఖతార్‌ మినిస్ట్రీ

- June 07, 2017 , by Maagulf
ఆహార పదార్థాల కొరతలేదు: ఖతార్‌ మినిస్ట్రీ

ఖతార్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ (ఎంఇసి) ఉన్నతాధికారి, దేశంలో ఆహార పదార్థాల కొరత లేదని స్పష్టం చేశారు. ఎంఇసి అండర్‌ సెక్రెటరీ షేక్‌ జస్సిమ్‌ బిన్‌ జబెర్‌ అల్‌ థని మాట్లాడుతూ, ఖతార్‌ సర్‌ప్లస్‌ ఫుడ్‌ సప్లయ్‌ కలిగి ఉందనీ, అన్ని రకాల ఆహార పదార్థాలూ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉన్నాయని తెలిపారు. అలాగే ఫుడ్‌ షార్టేజీ తలెత్తకుండా ఎమర్జన్సీ ప్లాన్‌ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. నివాసితులు అలాగే, పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పొరుగు దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకోవడంతో దేశంలో ఆహార పదార్థాల కొరత ఉండవచ్చునన్న ప్రచారంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఖతార్‌ అధికారిక వర్గాలు పౌరులను అప్రమత్తం చేసి, వాస్తవ పరిస్థితుల్ని వివరించేందుకు ప్రయత్నిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com