మీ స్మార్ట్ ఫోన్ మీ పాస్‌పోర్ట్
- June 08, 2017
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డిపాచ్యూర్ అయ్యే ప్రయాణీకులు ఇకపై తమ స్మార్ట్ ఫోన్లను స్మార్ట్ గేట్ వద్ద వినియోగిస్తే సరిపోతుంది. పాస్‌పోర్ట్‌కి బదులుగా ఈ స్మార్ట్ సర్వీస్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 'స్మార్ట్ యూఏఈ వ్యాలెట్' పేరుతో ఈ కొత్త సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ లెఫ్టినెంట్ జనరల్ దహి ఖల్ఫాన్ తమీమ్ మరియు, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ ఇన్ దుబాయ్ మేజర్ జనరల& మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి చెప్పారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌తో కలిసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిపాచ్యూర్ క్లియరెన్స్ ఈ కొత్త విధానంతో 9 నుంచి 12 సెకెన్ల సమయానికి కుదించబడ్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి యూఏఈ వాలెట్ యాప్, టెర్మినల్ 3లో మాత్రమే ఉపయోగపడ్తుంది. ముందు ముందు అన్ని టెర్మినల్స్‌లోనూ దీన్ని వినియోగంలోకి తెస్తారు. ముందుగా ఈ యూఏఈ వాలెట్లో ప్రయాణీకుడికి సంబంధించిన పర్సనల్ ఐడీ, పాస్‌పోర్ట్ డిటెయిల్స్, స్మార్ట్ గేట్ కార్డ్ డేటా వంటివి పొందుపరుస్తారు. యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్‌ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రయాణించడానికి ముందుగా యూఏఈ వాలెట్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసిన తర్వాత, యూఏఈ వాలెట్ ద్వారా జనరేట్ చేయబడ్డ బార్కోడ్స్ని ఇ-గేట్స్ వద్ద చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్‌లో తగ్గిన బంగారం ధరలు..!!









