ఎన్టీయార్‌ 'జైలవకుశ' కోసం భారీ సెట్‌

- June 09, 2017 , by Maagulf
ఎన్టీయార్‌ 'జైలవకుశ' కోసం భారీ సెట్‌

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీయార్‌ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో 'జైలవకుశ' సినిమా చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీయార్‌ తన కాల్షీట్లను పూర్తిగా ఈ సినిమాకే కేటాయించడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ సినిమా పూర్తయిపోతుందట. ఎన్టీయార్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ వేశారట. రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఓ భారీ ఇండోర్‌ సెట్‌ వేశారట. ప్రస్తుతం ఈ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com