ఆఫ్గనిస్తాన్‌లోని మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి

- June 10, 2017 , by Maagulf
ఆఫ్గనిస్తాన్‌లోని మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి

మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్గనిస్తాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.
గార్డెజ్‌ పట్టణంలో గల మసీదులో ప్రజలు ప్రార్ధన చేస్తున్న సమయంలో దాడి జరిగిందని ఆఫ్గనిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యత తమదే అని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ వెల్లడించలేదని జినువా వార్తాసంస్థ తెలిపింది. రంజాన్‌ మాసం సదర్భంగా నిర్వహించే  ‘తరవి’  ప్రార్థనల్లో ఈ కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com