నితిన్ 'లై' ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది

- June 10, 2017 , by Maagulf
నితిన్ 'లై' ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది

అ..ఆ సూపర్ హిట్ తర్వాత నితిన్ రేంజ్ బాగా పెరిగింది..సినిమాల ఎంపిక లో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం లో లై (అబద్ధం) పేరుతో తెరకెక్కున్న సినిమా లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమెరికా లో జరుపుకుంటుంది. కాలిఫోర్నియా లోని అందమైన లొకేషన్లలో సినిమాకు సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు చికాగో లోని ట్రంప్ టవర్ లో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా జూన్ 12 న సినిమాలోని ఫస్ట్ సాంగ్ బొంబాత్ ను ఉదయం 9:30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
మేఘా ఆకాశ్ , నితిన్ కు జోడిగా నటిస్తుండగా దాదాపు రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com