రేపటి నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం
- October 12, 2015
మంగళవారం నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఖరారు చేశారు. 13, 14, 15 తేదీలలో మన మట్టి-మన నీరు, పుట్టమట్టి, వాగు వంకల నుంచి జలాల సేకరణ, సర్వమత ప్రార్ధనల మధ్య కలశాల ఊరేగింపు ఉంటుంది. అలాగే 15వ తేదీ రాత్రి మండల కేంద్రాలకు కలశాలు వెళతాయి. ఇక 16, 17 తేదీలలో మండల కేంద్రాలలో కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18వతేదీన నియోజకవర్గ కేంద్రాల్లో కలశాల ఊరేగింపు ఉంటుంది. 19వ తేదీ కల్లా రాజధాని అమరావతికి కలశాలు చేరతాయి. 20, 21 తేదీలలో అమరావతిలో కలశాలకు పూజ నిర్వహిస్తారు. కాగా... ఆ కార్యక్రమాల పర్యవేక్షణకు నియోజవర్గానికో ఇంచార్జిని నియమించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







