బోర్డర్‌లో శాశ్వత మీడియా సెంటర్‌

- June 13, 2017 , by Maagulf
బోర్డర్‌లో శాశ్వత మీడియా సెంటర్‌

జజాన్‌: శాశ్వత మీడియా సెంటర్‌ని సదరన్‌ బోర్డర్‌ వద్ద మీడియా ప్రతినిథుల కోసం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ సెంటర్‌ తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ డాక్టర్‌ అవ్వాద్‌ బిన్‌ సలెహ్‌ అల్‌ అవ్వాద్‌, తాత్కాలిక హెడ్‌ క్వార్టర్‌ని హోటల్‌ నుంచి రీజియన్‌లోని హెడ్‌ క్వార్టర్‌కి తరలించేందుకు నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయానికి అనుగుణంగా మీడియా సెంటర్‌ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్‌ వెంట పలువురు మీడియా ప్రతినిథులు, ఆయా మీడియా సంస్థల ఎడిటర్లు పాల్గొన్నారు. సదరన్‌ బోర్డర్‌ మీడియా సెంటర్‌ సూపర్‌ వైజర్‌ అబ్దుల్లా అల్‌ ఫిఫి మాట్లాడుతూ, ఈ సెంటర్‌ స్థానిక అలాగే, జిసిసి, అరబ్‌ మరియు అంతర్జాతీయ మీడియా ప్రతినిథులను స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు కలిగి ఉందని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com