చెక్ కేసులో మహిళకు జైలు శిక్ష సమర్థన
- June 13, 2017
మనామా:హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, డూడ్ చెక్స్ ఇచ్చిన కేసులో మహిళకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. తనపై విధింపబడ్డ శిక్షను సవాల్ చేస్తూ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టుని నిందితురాలు ఆశ్రయించడం జరిగింది. అయితే నిందితురాలు అకౌంట్లో డబ్బులు లేకుండా మొత్తం 33 చెక్‌లను ఇచ్చి తనను మోసం చేసిందని బాధితురాలు న్యాయస్థానానికి నివేదించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితురాలి అభ్యర్థనను తిరస్కరించింది. నిందితురాలికి ఐదేళ్ళ రెండు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. పలువురు వ్యక్తుల నుంచి నిందితురాలు 45,700 బహ్రెయినీ దినార్స్ అక్రమంగా సొంతం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఓ వ్యక్తి నుంచే ఆమె 15,000 బహ్రెయినీ దినార్స్‌కి పైగా లాక్కున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..







