చెక్‌ కేసులో మహిళకు జైలు శిక్ష సమర్థన

- June 13, 2017 , by Maagulf
చెక్‌ కేసులో మహిళకు జైలు శిక్ష సమర్థన

మనామా:హై క్రిమినల్‌ అప్పీల్స్‌ కోర్టు, డూడ్‌ చెక్స్‌ ఇచ్చిన కేసులో మహిళకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. తనపై విధింపబడ్డ శిక్షను సవాల్‌ చేస్తూ హై క్రిమినల్‌ అప్పీల్స్‌ కోర్టుని నిందితురాలు ఆశ్రయించడం జరిగింది. అయితే నిందితురాలు అకౌంట్‌లో డబ్బులు లేకుండా మొత్తం 33 చెక్‌లను ఇచ్చి తనను మోసం చేసిందని బాధితురాలు న్యాయస్థానానికి నివేదించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితురాలి అభ్యర్థనను తిరస్కరించింది. నిందితురాలికి ఐదేళ్ళ రెండు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. పలువురు వ్యక్తుల నుంచి నిందితురాలు 45,700 బహ్రెయినీ దినార్స్‌ అక్రమంగా సొంతం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఓ వ్యక్తి నుంచే ఆమె 15,000 బహ్రెయినీ దినార్స్‌కి పైగా లాక్కున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com