ఈద్ తర్వాత వేసవి శిబిరాల్లో పాల్గొననున్న 3,400 మంది సౌదీ విద్యార్థులు

- June 14, 2017 , by Maagulf
ఈద్ తర్వాత వేసవి శిబిరాల్లో పాల్గొననున్న 3,400 మంది సౌదీ విద్యార్థులు

 రమదాన్  పండుగ అనంతరం సౌదీ అరేబియాలో నిర్వహించనున్న 3,400 ఎంపిక చేయబడిన  విద్యార్ధులు వేసవి శిబిరాల్లో పాల్గొంటారు. మూడు-వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమంను   రాజు అబ్దులజిజ్ మరియు ఆయన సహచర ఫౌండేషన్ ఫర్ క్రియేటివిటీ అండ్ క్రియేటివిటీ (మోవిబా) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ వేసవి శిబిరాలలను  రియాద్, మక్కా, జెడ్డా, అబా మరియు మదీనా వంటి ప్రధాన నగరాలలో ఏర్పాటుచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో అనుభవజ్ఞులైన శిక్షకుల బృందం నేతృత్వంలో ఈ వేసవి శిబిరాలు నిర్వహించబడతాయి. వేసవి శిబిరాలలో చేరేందుకు సౌదీ విద్యార్థులు తమ తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి. వ్యక్తిగత మరియు సామాజిక నైపుణ్యాలను మెరుగుపర్చుకొనేందుకు ఇదో అద్భుత అవకాశం. స్థానిక పొరుగు ప్రాంతంలో నిర్వహించబడే ఈ వేసవి శిబిరాల్లో నిర్వహించబడే కార్యక్రమం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com