మెట్రో రైలులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణం
- June 17, 2017
కేరళలో తొలి మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. కోచిలో మెట్రో రైలు ప్రారంభించిన అనంతరం పలరివట్టం నుంచి పాత దిప్పలానికి మెట్రో రైలులో సామాన్య ప్రయాణికుడిగా మోదీ ప్రయాణం చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఓవరాల్‌గా 25 కిలోమీటర్ల దూరం కాగా.. తొలి దశలో 13.2 కిలోమీటర్లు పొడవున ఆలువా-పలరివట్టం మార్గంలో ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో 11.8 కి.మీ మార్గంలో సేవలు అందించనున్నట్లు అధికారులు చెప్పారు.
బస్సులో ఈ మార్గంలో వెళ్లేందుకు 45 నిమిషాలు పట్టనుండగా, ఈ మెట్రో రైలులో కేవలం 23 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. 2013లో శంకుస్థాపన జరిగిన ఈ దశకు నేటితో మోక్షం కలిగింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా ఉద్యోగం కల్పించేందుకు సిద్ధమని కోచి మెట్రో రైలు కార్పోరేషన్ ఇటీవల పేర్కొంది. కేరళ గవర్నర్ సదాశివం, సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, 'మెట్రో మ్యాన్' ఈ శ్రీదరన్ సహా పలువురు మెట్రో రైలులో ప్రయాణం చేశారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







