తెలుగు ,తమిళ భాషలలో 'సైరత్ ' ని రీమేక్ చేయనున్నారు
- June 17, 2017
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'సైరత్'. కొత్త తారలతో 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం 100 కోట్ల మైలురాయిని దాటినా తొలి మరాఠీ భాషా చిత్రం గా రికార్డులు సృష్టించింది. పరువు హత్యల నేపథ్యం లో రూపొందించిన ఈ చిత్రం లో ఆకాష్ తొషర్, రింకు రాజగురు హీరో హీరోయిన్లు గా నటించారు. నాగరాజ్ మంజులే దర్శకత్వం చేసారు . ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, కరన్ జోహార్ వంటి ఎందరో ప్రముఖ బాలీవుడ్ తారల మనసు దోచుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ రైట్స్ కోసం విపరీతమయిన క్రేజ్ నెలకొంది. చివరికి భారీ మొత్తం చెల్లించి ప్రముఖ నిర్మాణ సంస్థ రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత వెంకటేష్ మరియు జీ స్టూడియోస్ సంస్థ చేజిక్కించుకున్నారు .ఈ సందర్భం గా రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ... "నా మనసుకి నచ్చిన సినిమా ఇది. చుసిన వెంటనే ఈ సినిమా రీమేక్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాo.66వ బెర్లిన్ చిత్రోత్సవం లో ఈ సినిమా చుసిన అందరు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. లాస్ ఏంజెల్స్ లో ని సోనీ సింఫనీ స్టూడియో లో పాటల రికార్డింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. అందరికి బాగా తెలిసిన కథనే దర్శకుడు నాగరాజ్ మంజులే హృద్యంగా తెర పై ఆవిష్కరించారు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రింకు రాజగురు కి జాతీయ పురస్కారం కూడా దక్కింది. చిన్న సినిమాల లో పెద్ద విప్లవం తీస్కొచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో తెలుగు, తమిళం భాషలలో రీమేక్ చేయనున్నాం. తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యింది .ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక జరుగుతోంది .పూర్తి వివరాలు అతి త్వరలో నే తెలియచేస్తాం." అని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







