మెట్రో రైలులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణం

- June 17, 2017 , by Maagulf
మెట్రో రైలులో ప్రధాని నరేంద్ర  మోదీ ప్రయాణం

కేరళలో తొలి మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. కోచిలో మెట్రో రైలు ప్రారంభించిన అనంతరం  పలరివట్టం నుంచి పాత దిప్పలానికి మెట్రో రైలులో సామాన్య ప్రయాణికుడిగా మోదీ ప్రయాణం చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఓవరాల్‌గా 25 కిలోమీటర్ల దూరం కాగా.. తొలి దశలో 13.2 కిలోమీటర్లు పొడవున ఆలువా-పలరివట్టం మార్గంలో ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో 11.8 కి.మీ మార్గంలో సేవలు అందించనున్నట్లు అధికారులు చెప్పారు.
బస్సులో ఈ మార్గంలో వెళ్లేందుకు 45 నిమిషాలు పట్టనుండగా, ఈ మెట్రో రైలులో కేవలం 23 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. 2013లో శంకుస్థాపన జరిగిన ఈ దశకు నేటితో మోక్షం కలిగింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా ఉద్యోగం కల్పించేందుకు సిద్ధమని కోచి మెట్రో రైలు కార్పోరేషన్ ఇటీవల పేర్కొంది.  కేరళ గవర్నర్ సదాశివం, సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, 'మెట్రో మ్యాన్‌' ఈ శ్రీదరన్ సహా పలువురు మెట్రో రైలులో ప్రయాణం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com