మద్యానికి బానిసై జీవితం కోల్పోయిన మహానటి మీనా కుమారి
- June 17, 2017
వెండి తెరపై.. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని.. అభిమానుల మనసులలో తమదైన ముద్రను వేసుకొన్న తారల జీవితం.. సుఖ సంతోషల మయం అనే భావన ఎంతోమందికి ఉన్నది.. కానీ తమ మేకప్ తో తెరముందు ప్రేక్షకులను మైమరపించే ఈ హీరోయిన్లు.. తెరవెనుక జీవితం కన్నీటి మయం.. అనేకమంది నటీమణులు.. తమ జీవితాన్ని అత్యంత విషాదంగా ముగించిన సంఘటనలు కోకొల్లలు.. బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ గా పేరు తెచ్చుకొన్న అలనాటి అందాల నటి.. మీనాకుమారి జీవితం అత్యంత విషాదం..గా ముగిసింది.. వివరాల్లోకి వెళ్తే...
మీనా కుమారి ముంబైలో ఆగష్టు 1 , 1933 లో జన్మించింది. అలీ బక్ష్, ఇక్బాల్ బేగమ్ ల రెండో కూతురైన మీనా కుమారి.. అసలు పేరు.. మహాజబీన్.. ఆమె కుటుంబ పెద కుటుంబం కావడంతో.. మీనా కుమారి పుట్టిన సమయంలో ఆస్పత్రి బిల్ కూడా కట్టలేని పరిస్తితి. దీంతో మీనాకుమారిని ఆస్పత్రి సిబ్బంది అనాధ శరణాలయం లో వదిలి వేశారు.. అక్కడ కొద్ది రోజులు పెరిగిన తర్వాత అనాధ శరణాలయం నుంచి తల్లిదండ్రులు మీనాకుమారిని తెచ్చుకొన్నారు. మహాజబీన్.. ను మీనా కుమారిగా మార్చి బాలనటిగా ఏడవ ఏటే త్ర రంగ ప్రవేశం అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్ భట్ట బాబీ.. కుటుంబ పోషణ నిమిత్తం.. స్కూల్ కు వెళ్లాల్సిన వయసులో.. రంగాస్థలం పై అడుగు పెట్టింది.. 10 ఏళ్ల వయసు నుంచి కుటుంబ పోషణ.. బాధ్యతలు తీసుకొన్నది.. సినిమాల్లో నటించడం ఇష్టం లేకున్నా.. కుటుంబం కోసం.. సినిమాల్లో నటిస్తూ.. ట్రాజెడీ క్వీన్ గా ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ఓ పేరు తెచ్చుకొన్నది. అనార్కలి సినిమాలో నటిస్తున్న సమయంలో కమల్ అమ్రోహి తో పరిచయం మీనాకుమారి జీవితాన్ని మలుపు తిప్పింది అని చెప్పవచ్చు.. అప్పటికే ఇద్దరు భార్యలున్న కమల్ ను మీనాకుమారి ప్రేమించి పెళ్లి కూడా చేసుకొన్నారు.. ఫిల్మ్ అవార్డ్ అందుకొన్న తొలినాటి మీనా కుమారి.. కి చదువు లేకపోయినా ఉర్దూ లో మంచి కవిత్వం చెప్పేవారు.. బైజు బావరా, పరిణీత, సాహిబ్ బీబీ ఔర్ గులామ్ , కాజల్, వంటి సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అందుకోన్న మీనా అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కాగా మీనా భర్త కమల్ కు బిమల్ రాయ్, గురు దత్ సినిమాల్లో నటించడం ఇష్టం లేదు.. దీంతో వీరి సినిమాల్లో నటించే అవకాశం దక్కినా వదులుకొన్నది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మొదలైన మనస్పర్ధలు... విడిగా ఉండేలా దారి తీశాయి.. దీంతో వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడూ మొదలు పెట్టిన పాకీజా సినిమా పూర్తి కావడానికి 14 ఏళ్ళు పట్టింది. ఈ పాకీజా సినిమా భారత దేశ సినీ చరిత్రలో ఓ క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది. కాగా గురుదత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహిబ్ బీబీ ఔర్ గులామ్ సినిమాలో మద్యం తాగే సన్నివేశం కోసం.. నటన లో సహజత్వం కోసం మీనాకు మద్యం పోసి ఇచ్చారు.. అదే ఆమె జీవితం పాలిట శాపంగా మారి నాశనం కావడానికి దోహదం చేసింది. తాగుడుకి బానిసైన మీనా కుమారి.. లివర్ శిరోసీస్ వ్యాధితో మంచానికే పరిమితమై అత్యంత దీన స్థితిలో జీవితాన్ని ముగించింది. పుట్టినప్పుడు ఎలా ఆస్పత్రి బిల్ కట్టలేని స్థితిలో ఉందో.. మరణించే సమయంలో కూడా మీనా కుమారి పరిస్తితి అలాగే ఉన్నది.. జననం.. మరణం రెండింటా దైన్యమే.. 1972 మార్చి 31 గుడ్ ఫ్రైడే రోజున మీనా కుమారి మరణించారు.. బాలీవుడ్ లో స్టార్ హీరో .. మహానటి అంత్యక్రియలు సామాన్య వ్యక్తి కంటే దీనస్థితిలో జరిగాయి.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







