'నేను కిడ్నాప్ అయ్యాను' షూటింగ్ పూర్తి
- June 17, 2017
మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, 'కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో' దగ్గుపాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. నిర్మాత మాధవి అద్దంకి గారు మాట్లాడుతూ షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని ప్రస్తుతం సెన్సార్ వర్క్స్ చేస్తున్నాము. డైరెక్టర్ శ్రీకర్ బాబు చాల బాగా ఈ సినిమా తీశారు. మా చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది" అన్నారు.
దర్శకుడు శ్రీకర్ బాబు మాట్లాడుతూ చిత్రం అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. మా చిత్రం కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు. బ్రహ్మానందం , పోసాని , తాగుబోతు రమేష్ చాలా బాగా సహకరించారు. మా చిత్ర నిర్మాత మాధవి అద్దంకి మాకు చాలా సపోర్ట్ చేశారు. మా వెన్నంటి ఉండి మాకు షూటింగ్ కి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని జులై లో సినిమా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము" అన్నారు. ఈ చిత్ర సమర్పకులు దగ్గుపాటి వరుణ్ మాట్లాడుతూ "ఈ చిత్రం అవుట్ పుట్ చూసాను. చాలా బాగా వచ్చింది. దాంతో నేను కూడా భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నాను. జులై లో రిలీజ్ కాబోతున్న మా చిత్రం ప్రేక్షకుల అభిమానం కచ్చితంగా సంపాదిస్తుంది " అన్నారు.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







