క్యూబాతో దోస్త్ రద్దు చేసుకున్న అమెరికా
- June 17, 2017
-ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్
రెండేండ్ల కిందట క్యూబాతో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేశారు. క్యూబాతో వాణిజ్య, పర్యాటక సంబంధాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో క్యూబా అధ్యక్షుడు రౌల్క్యాస్ట్రోపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని మియామీలో క్యూబన్ అమెరికన్లు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రౌల్క్యాస్ట్రో ప్రభుత్వం తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా డాలర్లతో సైనిక, నిఘా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. క్యూబా ప్రజలను దోచుకునే, అవమానించే ఇలాంటి చర్యలను అనుమతించబోం. అందుకే ఒప్పందాన్ని రద్దు చేస్తున్నా అని ప్రకటించారు. క్యూబాతో పర్యాటక, వాణిజ్య సంబంధాలపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు.
క్యాస్ట్రో ప్రభుత్వం ఉత్తరకొరియాకు ఆయుధాలు ఎగుమతి చేయడంతోపాటు, వెనిజులాలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడటానికి కారణమైందని ఆరోపించారు. క్యూబా ప్రభుత్వం అమాయకులను బంధిస్తూ, కరుడుగట్టిన నేరగాళ్లను వదిలేస్తున్నదని మండిపడ్డారు. మానవుల అక్రమ రవాణాను, శ్రమదోపిడీని ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయడంతోపాటు, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించేవరకు క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయబోమని పునరుద్ఘాటించారు.
స్వేచ్ఛ కోసం క్యూబా ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతామని చెప్పారు. ట్రంప్ నిర్ణయంపై క్యూబా ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని ప్రకటించింది. దశాబ్దాల పాటు కత్తులు దూసుకున్న అమెరికా, క్యూబా రెండున్నరేండ్ల కిందటే చేయి చేయి కలుపుకొన్నాయి.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!







