కాఫీ అధికంగా తాగితే కలిగే దుష్ప్రభావాలు

- June 18, 2017 , by Maagulf
కాఫీ అధికంగా తాగితే కలిగే దుష్ప్రభావాలు

మీరు కాఫీ ప్రియులా? మార్నింగ్ ఓ పెద్ద కప్ కాఫీ తాగితే కాని మీ రోజు మొదలవ్వదా? రోజులో ఎప్పుడైనా కాఫీ కి రెడీయా? అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. అవును, అతిగా తీసుకుంటే అమృతం కూడా విషం అవుద్దననేది అక్షరాల నిజం. కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం.

ఐరన్ గ్రహణ లోపం మరియు కిడ్నీ సమస్యలు
అధికంగా కాఫీ తాగడం వలన కిడ్నీ మరియు శరీరం వివిధ మైక్రో మినరల్స్ గ్రహించే శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా, కిడ్నీ లు ఐరన్, మేగ్నిషియం ఇతరత్రా మినరల్ లను గ్రహించడం లో సమస్యల తలెత్తుతాయి.  దీని వలన మలబద్దకం లాంటి తలెత్తవచ్చు, అంతేకాక ఇతరత్రా కడుపుకు సంభందించిన సమస్యలు కూడా తలెత్తుతాయి.

డిహైడ్రేషన్ మరియు దుర్వాసన
కాఫీ శరీరాన్ని డి హైడ్రేషన్ కు గురుచేస్తుంది. అలాగే నోటి  దుర్వాసనకు కూడా తోడ్పడుతుంది.  డి హైడ్రేషన్ గురి చేయడం వలన శరీరం లో నుండి బయటకు పంపించాల్సిన చనిపొయిన  మ్యుకోసాల్  సెల్స్ అలాగే బాడీ లో ఉంది పోతాయి. దీనితో దుర్వాసన తలెత్తుతుంది. ఎంత ఎక్కువ కాఫీ తాగితే అంత దుర్వాసన అన్నమాట.
pinterest
3
ఆహార సంగ్రహణ సమస్యలు
సహజంగా ఉదయన్నే ఒక కప్ కాఫీ బోవేల్ మూవ్మెంట్స్ ను సులువు చేసినప్పటికీ, ఎక్కవ తాగడం వలన శరీరం ఆహారాన్ని గ్రహించే కెపాసిటీ తగ్గిపోయి మెటబాలిజం దెబ్బతిన్నే అవకాసం ఉంది. అధిక కాఫీ ఆహారం  చిన్న ప్రేగు గుండా తొందరగా వెల్లిపోయేలా చేస్తుంది. ఫుడ్ లోని పోషకాలను బాడీ గ్రహించడమ లో విపలం అవుతుంది. దీర్గకాలం లో దీనివల్ల పెద్ద సమస్యలు రావొచ్చు.

నడుము సైజు పెరగడం
హోల్ మిల్క్ తో చేసిన కాఫీలు ఎక్కువగా తాగడం వలన, శరీరం లో కేలోరీ ల లోడ్ పెరుగుతుంది. పైగా కాఫీ లో రిఫైనడ్ షుగర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కూడా ఎంపి కాలోరీస్ ఎ. ఇది శరీరం లో వివిధ భాగాలతో పాటు గ నడుము లో కూడా కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com