స్కూళ్ళపై దుండగుల దాడి

- June 18, 2017 , by Maagulf
స్కూళ్ళపై దుండగుల దాడి

దుండగులు, నాలుగు స్కూళ్ళపై దాడులకు తెగబడటం విద్యార్థులని ఆందోళనకు గురిచేస్తోంది. స్కూళ్ళపై రాళ్ళతో దుండుగులు దాడికి దిగారు. ఈ దారుడలపై ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ - పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ డైరెక్టరేట్‌ స్పందించింది. నాలుగు స్కూళ్ళపై గుర్తు తెలియని దుండుగలు దాడులకు పాల్పడినట్లు నిర్ధారించింది. పోలీసులు ఈ ఘటనలపై విచారణ చేపడుతున్నారు. ఆలి ఇంటర్మీడియట్‌ గర్ల్స్‌ స్కూల్‌, అల్‌ ముంతర్‌ ఇబ్‌న్‌ సవా ఎలిమెంటరీ బాయ్స్‌ స్కూల్‌, అల్‌ ఖలీల్‌ ఇబ్‌న్‌ అహ్మద్‌ ఇంటర్మీడియట్‌ బాయ్స్‌ స్కూల్‌, సానాబిస్‌ ఇంటర్మీడియట్‌ బాయ్స్‌ స్కూల్‌పై దాడులు జరిగాయి. ఈ దాడులతో ఆయా విద్యాసంస్థల ప్రాంగణాలు కొంతమేర డ్యామేజీకి గురయ్యాయి. గడచిన ఆరేళ్ళలో 561 స్కూళ్ళు ఈ తరహా దాడులకు గురయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. విద్యా హక్కుని హరించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com