ఇఫ్తార్‌ విందు నిర్వహించనున్న ఇండియన్‌ క్లబ్‌

- June 18, 2017 , by Maagulf
ఇఫ్తార్‌ విందు నిర్వహించనున్న ఇండియన్‌ క్లబ్‌

ఇండియన్‌ క్లబ్‌ మరియు ఇండెక్స్‌ బహ్రెయిన్‌ సంయుక్తంగా ఇండియన్‌ క్లబ్‌ ఆడిటోరియంలో ఇఫ్తార్‌ విందుని ఏర్పాటు చేశాయి. ఈ రోజు ఈ ఇఫ్తార్‌ విందు జరుగుతుంది. అన్ని ఇండియన్‌ క్లబ్స్‌, అలాగే ఇండెక్స్‌ మెంబర్స్‌ ఇఫ్తార్‌ విందుకి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవ్వాల్సిందిగా అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ కాసియస్‌ పెరీరా మరియు ఇఫ్తార్‌ కోఆర్డినేటర్‌ ఇఫ్తార్‌ అబ్దుల్లా రఫీక్‌ మాట్లాడుతూ కమ్యూనిటీ అందిస్తున్న సేవా కార్యక్రమాల్ని మరింతగా విస్తరించేందుకు, కమ్యూనిటీని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com