గుండెపోటుతో మరో ప్రవాసీయ భారతీయుడు మృతి
- June 19, 2017
మనామా: హృదయ సంబంధిత వ్యాధులతో ప్రవాసియ భారతీయలు ఇటీవల గల్ఫ్ దేశాలలో విషాదంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఇదే క్రమంలో గుడాబియాలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్ అనే ప్రవాసియ భారతీయుడు తన అపార్ట్మెంట్ లో గుండె ఆగిపోవడంతో మరణించాడు. ఒయాసిస్ పెర్ ఫ్యూమ్స్ (అత్తరు) కంపెనీలో విక్రయాల ప్రతినిధిగా పనిచేశాడు. ఆయన గత కొంతకాలంగా తన భార్యతో ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మేము ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండగా కనుగొన్నామని వెంటనే స్పందించి అంబులెన్స్ ని పిలిపించామని తెలిపారు. ఆయనను పరీక్షించిన అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది దాదాపు 10 నిమిషాల క్రితమే గుండెపోటుతో అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్ చనిపోయాడని తెలిపారు. ఆయన కు సంబంధిన మరణధ్రువీకరణ పత్రాలు తదితర అనుమతి పత్రాల పని పూర్తికావడం కాగానే ఆయన భౌతికకాయాన్ని వెంటనే భారతదేశానికి పంపుతాము పొరుగు నివాసి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







