అక్రమ రిక్రూట్మెంట్పై ఉక్కుపాదం
- June 19, 2017
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ ఇకపై అక్రమ రిక్రూట్మెంట్లను మరింత కఠినంగా పరిగణించబోతోంది. ఓ స్పాన్సర్‌కి చెందిన వర్కర్స్‌ని మరో స్పాన్సర్ కోసం పంపితే ఆ కాంట్రాక్ట్‌ని రద్దు చేయడంతోపాటుగా, మొదటి స్పాన్సర్నీ, రెండో స్పాన్సర్నీ ఏడాదిపాటు రిక్రూట్మెంట్కి వీల్లేకుండా బ్యాన్ చేయనున్నారు. ఈ నేరానికిగాను 25,000 సౌదీ రియాల్స్ జరీమానా కూడా విధించే అవకాశం ఉంది. రెండోసారి ఇదే నేరం చేస్తే జరీమానా 50,000 సౌదీ రియాల్స్‌కి చేరుకుంటుంది. బ్యాన్‌ని రెండేళ్ళకు పెంచుతారు. ఎంప్లాయర్ అలాగే మేనేజర్ ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావొచ్చు. మూడోసారి ఇదే క్రైమ్ రిపీట్ అయితే 100,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఐదేళ్ళ రిక్రూట్మెంట్ బ్యాన్, ఏడాదిపాటు జైలు శిక్ష తప్పదు. మినిస్ట్రీ ఎప్పటికప్పుడు ఆయా సంస్థలపై తనిఖీలు నిర్వహిస్తుందనీ, అలాగే తమకు అందే ఫిర్యాదుల నేపథ్యంలోనూ చర్యలు తీసుకుంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







