ఫామిలీ తో 'డీజే'ని చూసిన బన్నీ

- June 20, 2017 , by Maagulf
ఫామిలీ తో 'డీజే'ని చూసిన బన్నీ

దువ్వాడ జగన్నాథమ్‌ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ లోగ ఈ సినిమాను చుసేశారు అల్లు అర్జున్ అండ్ యూనిట్ మెంబర్స్. బన్నీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి, నిర్మాత దిల్ రాజు, శిరీష్, వారి కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్ లో వేశారు. ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేశారట యూనిట్ సభ్యులు. 

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. పూజ హెగ్డే హీరోయిన్ . దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించాడు. ఈ నెల(23)న శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా టీజర్లు ట్రైలర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com