కబ్ద్ జాతీయ రహదారిలో తగలపడిపోయిన కారు...వ్యక్తి సజీవ దహనం

- June 21, 2017 , by Maagulf
కబ్ద్  జాతీయ రహదారిలో తగలపడిపోయిన కారు...వ్యక్తి సజీవ దహనం

 పరుగులు పెడుతున్న ఓ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి క్షణాలలో వాహనం తగిలబడిపోయిన సంఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కబ్ద్ జాతీయ రహదారిలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో అగ్నిజ్వాలల నడుమ తప్పించుకోలేక ఆ వ్యక్తి కాలి బూడిదయ్యాడని భద్రతావర్గాలు తెలిపాయి. కారు ప్రమాదానికి గురైన వాస్తవ కారణాన్ని నిర్ధారించేందుకు విచారణ ప్రారంభమైంది. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ దోహా స్పూర్ ప్రత్యేకంగా సన్నివేశ స్థలంలో వాహనం అగ్నికి ఏ విధంగా గురైందో నివేదించారు.  మంటలలో చిక్కుకొన్న వాహనంలోకి ఇద్దరు వ్యక్తులు  స్వల్ప గాయాలతో మంటల నుంచి రక్షించబడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం స్థానిక  జహ్రా ఆసుపత్రికి తరలించారు. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి.సల్మియా అగ్నిమాపకదళ సిబ్బంది పంపబడ్డారు.  అగ్నిని ఇంజిన్ నుంచి వాహనం లోపలకు వ్యాపించకుండా అడ్డుకునేందుకు నియంత్రించ గలిగినట్లు పేర్కొన్నారు. మిగతావారికి ఎటువంటి ప్రాణనష్టం లేదని నివేదించబడింది. ఇద్దరు పౌరులు కారు  లోపల చిక్కుకున్న తర్వాత డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని  అనేక సార్లు ప్రామాదం చేయబోయాడని భద్రతా మూలాల పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com