పవన్ కళ్యాణ్- హీరోవెంకీ ఫిల్మ్ వెనుక

- June 21, 2017 , by Maagulf
పవన్ కళ్యాణ్- హీరోవెంకీ ఫిల్మ్ వెనుక

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ ఓ వార్త హంగామా చేస్తోంది. రీసెంట్‌గా పవన్ - వెంకీలతో త్రివిక్రమ్ ఓ సీన్ షూట్ చేశాడని, అది ఫుల్ ఫన్నీగా వుంటుందంటూ ఇలా రకరకాలుగా న్యూస్ చక్కర్లు కొడుతోంది. చివరకు ఈ న్యూస్ నిజంకాదని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇందుకు కారణాలు లేకపోలేదు.
పవన్ - వెంకీలతో త్రివిక్రమ్ ఎలాంటి సీన్ షూట్ చేయలేదని, ఇప్పటివరకు పవన్ సెట్‌కి వెంకీ రాలేదని టాక్. త్రివిక్రమ్ స్టైల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రానున్న ఈ మూవీలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ తొలిసారి పవన్‌తో జతకడుతోంది. ఇటు సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుందట. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com