రానా నటించిన 'నేనే రాజు..' ట్రైలర్ వస్తోంది

- June 21, 2017 , by Maagulf
రానా నటించిన 'నేనే రాజు..' ట్రైలర్ వస్తోంది

రానా దగ్గుబాటి కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ దర్శకుడు. కాజల్ కథానాయిక. ఈ చిత్రం ట్రైలర్ను జూన్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు విశేష స్పందన లభించింది. రానా నటనను ప్రశంసిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియాలో ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో చిత్రంపై అంచనాలు పెరిగాయి.
సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 'నేనే రాజు నేనే మంత్రి'ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. కేథరిన్ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com