బంధువు ఇచ్చిన బాంబుని దాచేందుకు వెళ్తూ వ్యక్తి దుర్మరణం
- June 21, 2017
మనామా: ఒక బహ్రయిన్ వ్యక్తి బాంబుని భూమిలో పాతి పెడతానికి వెళ్తూ, దారిలో అది ఒక్కసారిగా పేలడంతో దుర్మరణం చెందాడు. సోమవారం ఉత్తర గవర్నెట్ పరిధిలో అల్ హజార్ గ్రామంలో ఉన్న ఒక పొలంలో రహస్యంగా ఆ బాంబుని దాచేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన బాంబు పేలుడు కారణంగా ఆ వ్యక్తి మరణం సంభవించినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి 40 ఏళ్ళ నబీల్ అబ్దుల్లా అహ్మద్ అల్ సమేహెగా గుర్తించారు. ఆ బాంబు అతని బంధువులలో ఒకరి ద్వారా ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో బాంబుని దాచేందుకు వెళ్తూ అల్ హజార్ గ్రామమును దాటుతూ ఉండగా, అతని చేతిలో ఆ బాంబు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన వ్యక్తికి బాంబు ఇచ్చిన బంధువుకు గతంలోనూ ఇలాంటి సంఘటనల స్క్మబంధం ఉన్నట్లు తెలియడంతో ఈ కేసు దర్యాప్తు సంబంధిత అధికారుల విచారణ ప్రారంభించిందని ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జూన్ 19 న హజార్ గ్రామంలో బాంబు పేలుడు ఫలితంగా మరణించినట్లు తెలుస్తోంది. అవసరమైన భద్రత చట్టబద్దమైన చర్యలకు సంబంధించి మరిన్ని వివరాల గూర్చి పరిశోధనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







