పాక్‌లో ఉగ్రస్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్న అమెరికా
- June 21, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్ పొరుగుదేశం అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులను అమెరికా తీవ్రతరం చేయనుంది. ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం... డ్రోన్ దాడులను విస్తృతం చేయడం, పాక్‌కు ఇస్తున్న నిధుల్లో కోత విధించడం లేదా వాటిని మళ్లించడం, నాటోయేతర మిత్రదేశంగా పాక్‌కు ఉన్న హోదాను తగ్గించడం తదితర చర్యలకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది.
అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అమెరికా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా విఫలమవుతోందనీ, ఇప్పుడు కూడా ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం లేదని కొంతమంది అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమకు పాక్ నుంచి గట్టి సహాకారం కావాలి కానీ, ఆ దేశంతో సంబంధాలను తెంచుకోవడం కాదని యూఎస్ అధికారులు పేర్కొన్నారు. త్వరలో ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టంగా నిర్ణయించలేదన్నారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







