వచ్చే నెలలో శ్రీలంకతో భారత్‌ 3 టెస్టులు, 5 వన్డేలు

- June 22, 2017 , by Maagulf
వచ్చే నెలలో శ్రీలంకతో భారత్‌ 3 టెస్టులు, 5 వన్డేలు

వచ్చే నెలలో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 21 నుంచి సెప్టెంబరు 6 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్‌ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది.  విండీస్‌ నుంచి తిరిగి వచ్చాక 10 రోజులు విశ్రాంతి తీసుకొని శ్రీలంకకు భారత జట్టు వెళుతుంది.షెడ్యూల్‌: తొలి టెస్టు: జూలై 26–30, క్యాండీలో; రెండో టెస్టు: ఆగస్టు 4–8, గాలెలో; మూడో టెస్టు: ఆగస్టు 12–16, కొలంబోలో; తొలి వన్డే: ఆగస్టు 20న, కొలంబోలో; రెండో వన్డే: ఆగస్టు 24న, దంబుల్లాలో; మూడో వన్డే: ఆగస్టు 27న, పల్లెకెలెలో; నాలుగో వన్డే: ఆగస్టు 30న, పల్లెకెలెలో; ఐదో వన్డే: సెప్టెంబరు 3న, కొలంబోలో; టి20: సెప్టెంబరు 6న.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com