కొత్త రాష్ట్రపతి అభ్యర్ధిగా తెరపైకి అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్

- June 22, 2017 , by Maagulf
కొత్త రాష్ట్రపతి అభ్యర్ధిగా తెరపైకి అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్

రాష్ట్రపతి పదవికి ద్విముఖ పోటీ ఖాయమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా దళిత నేత రామ్ నాథ్ కోవింద్ రంగంలోకి దిగుతుండగా.. విపక్షాలు కూడా ప్రకాశ్ అంబేద్కర్ లేదంటే మీరా కుమార్ ను బరిలోకి దింపాలనుకుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం లేకపోవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇవాళ కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
భారత దేశ చరిత్రలో రాష్ట్రపతి ఎన్నిక ఒకే ఒకసారి ఏకగ్రీవమైంది. ఇప్పుడా పరిస్థితిని పునరావృతం చేద్దామని ప్రయత్నించిన ప్రధాని మోడీకి విపక్షాలు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి అనూహ్యంగా అభ్యర్థిని తెరపైకి తెచ్చాయి. పోటీ ఉండాల్సిందే అంటూ వామపక్షాలు డిసైడ్ అయ్యాయి. దీంతో కోవింద్‌కు పోటీగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌ పేరును తెరపైకి తెచ్చింది సీపీఎం. అప్పుడే గట్టి పోటీ ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం భరిఫ్ బహుజన్ మహాసంఘ్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రకాశ్ అంబేద్కర్ రెండు సార్లు లోక్‌సభ, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. మరోవైపు మీరాకుమార్, సుశీల్ కుమార్ షిండే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరిలో ఒకర్ని ఇవాళ జరిగే సమావేశంలో యూపీఏ ఖరారు చేయనుంది. 
అటు ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ కు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ ప్రిపేర్ చేశారు. తొలి సెట్ పై ప్రధాని మోడీ సంతకం చేయనుండగా, రెండో సెట్ పై సీఎం చంద్రబాబు, మూడో సెట్ పై అమిత్ షా, నాలుగో సెట్ పై పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేయనున్నారు. 
తనను ఎన్డీఏ తరపు అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు రామ్ నాథ్ కోవింద్ బీజేపీ సీనియర్లందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్ జోషిని కలుసుకుని ధన్యవాదాలు చెప్పారు. వారు కూడా కోవింద్ కు సంపూర్ణ ఆశీస్సులు అందజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com