యూఏఈలో వాట్సాప్‌ కాల్స్‌ - అనుమతి లేదు

- June 22, 2017 , by Maagulf
యూఏఈలో  వాట్సాప్‌ కాల్స్‌ - అనుమతి లేదు

యు.ఏ.ఈ: ప్రపంచ వ్యాప్తంగా 'వాట్సాప్‌' మేనియాలో మునిగి తేలుతోంది. ఫ్రీ కాలింగ్‌ సర్వీస్‌ని సైతం వాట్సాప్‌ అందిస్తోంది. అయితే యూఏఈలో వాట్సాప్‌ కాలింగ్‌పై నిషేధం ఉంది. గురువారం ఉదయం యూఏఈ నివాసితులు వాట్సాప్‌ కాలింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్న ఆనందాన్ని వ్యక్తం చేసేంతలోపే, అధికార వర్గాలు అలాంటి వెసులుబాటు ఏమీ కల్పించలేదని స్పష్టం చేయడంతో వారంతా ఉస్సూరుమన్నారు. ఈ తరహా కాలింగ్‌ సౌకర్యం ఎవరు అందించినా, అది నిబంధనలకు విరుద్ధమే అవుతుందని టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ పేర్కొంది. సోషల్‌ మీడియాలో 'వాట్సాప్‌ కాలింగ్‌ అన్‌ బ్లాక్‌డ్‌' అని ప్రచారం జరుగుతుండగా, దాన్ని అధికారిక వర్గాలు ఖండించాయి. భారతీయ వలసదారుడొకరు, అనుకోకుండా వాట్సాప్‌లో 'కాల్‌ బటన్‌'ని ప్రెస్‌ చేస్తే, ఆ వెంటనే అవతలి ఫోన్‌ రింగ్‌ అయ్యిందని చెప్పారు. దేశానికి దూరంగా ఉంటున్న తమకు, స్వదేశంలోని తమవారితో మాట్లాడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పలువురు వలసదారులు పేర్కొంటున్నారు. ఈ ఆప్షన్‌ లేకపోవడంతో తాము చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని వారు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com