'జయదేవ్' ఆడియో విడుదల

- June 24, 2017 , by Maagulf
'జయదేవ్' ఆడియో విడుదల

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవికి సినీ ప్రముఖుల ఆశీస్సులు లభించాయి. అతను నటిస్తున్న 'జయదేవ్' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

తమిళంలో విజయం సాధించిన 'సేతుపతి' చిత్రాన్ని తెలుగులో 'జయదేవ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ప్రముఖ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీతో మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి హీరోగా పరిచయం అవుతున్నాడు. మాళవిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇటీవల ఈ సినిమా ఆడియో ఆవిష్కరణతో పాటు ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించిన రవి తొలిచిత్రంతోనే చక్కని విజయాన్ని అందుకోవాలనే ఆకాంక్షను చిరంజీవి వ్యక్తం చేశారు.

'జయదేవ్' చిత్రంలో రవి స్క్రీన్ అప్పీయరెన్స్ సూపర్‌గా ఉందని సీనియర్ నటుడు మోహన్‌బాబు కితాబిచ్చారు. రవి... తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలనే ఆకాంక్షను కె. రాఘవేంద్రరావు వ్యక్తం చేశారు. మిత్రుడు గంటా శ్రీనివాసరావు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తన బ్యానర్‌లో 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్' తర్వాత వస్తున్న 'జయదేవ్' చిత్రం చక్కని విజయాన్ని సాధించి, హ్యాట్రిక్‌ను అందిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత కె. అశోక్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వారందరి ఆశీస్సులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గంటా రవి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com