దుబాయ్ లో రోబో 2.0 ఆడియో లాంచ్ మరియు ప్రపంచ వ్యాప్త ప్రమోషనల్ టూర్
- June 25, 2017
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న రోబో సీక్వెల్ చిత్రానికి 2.0 అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ వెంచర్ గా రాబోతున్న ఈ సినిమా వచ్చే జనవరి లో రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఈ తరుణం లో ఇప్పటి నుంచే ప్రమోషన్ కి ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్. పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేసుకుని జనవరి ఇరవై ఐదు న ఈ సినిమా విడుదల అవ్వచ్చు ఈ లోగా చాలా టైం ఉండడం తో భారీ ఎత్తున ప్రమోషన్ లు ప్లాన్ చేస్తున్నారు.
దీనికోసం ఒక వరల్డ్ టూర్ ని సిద్దం చేస్తున్నారు. దీపావళికి 2.0 ఫస్ట్ లుక్ విడుదల చేసి రజినీకాంత్ పుట్టినరోజు నాడు ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఇక ఆడియో ఫంక్షన్ విషయానికి వస్తే శంకర్ తన ఐ లాంటి సినిమాకే ఆర్నాల్డ్ ని పట్టుకొచ్చి షాక్ ఇచ్చాడు అలాంటిది ఇక రజినీకాంత్ సినిమా కావడం తో దుబాయ్ లో అంగరంగ వైభవంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఉంటుంది. ఈ లోగా టీం మొత్తం ప్రపంచ వ్యాప్త టూర్ వెళతారు.
హీరో రజిని, విలన్ అక్షయ్ కుమార్, ఆమీ జాక్సన్ ఇలా అందరూ పాల్గొనే ఈ టూర్ సినిమాకి చాలా పెద్ద పాజిటివ్ అవుతుంది అంటున్నారు మేకర్ లు. ఆసియా వ్యాప్తంగా ఎక్కువ థియేటర్ లలో ఈ సినిమాని విడుదల చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









