అభిమాని సుష్మిత కోరిక తీర్చిన హీరో మహేష్ బాబు

- June 25, 2017 , by Maagulf
అభిమాని సుష్మిత కోరిక తీర్చిన హీరో మహేష్ బాబు

వెండి తెర పై తమ నటనతో కోట్లాది మంది అభిమానులను పొందిన మన సెలెబ్రెటీలను దగ్గర నుండి చూడాలని ఎంతో మంది నిరంతరం తహతహ లాడుతూ ఉంటారు. అయితే ఆకోరిక తీరేది కొద్దిమందికి మాత్రమే అయినా చాలామంది అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఈ నేపధ్యంలో మహేష్ ను కలవాలని నిరంతరం కలలు కంటూ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఒక చిన్నారి కోరిక మహేష్ తీర్చిన ఒక విషయానికి సంబంధించి ఒక ఆసక్తికర కధనం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ అంటే ఇష్టంలేని వ్యక్తులు ఎవరు ఉండకపోయినా ఆ చిన్నారి కి సంబంధించిన విషయం మాత్రం వేరు.
మహేష్ ను అమితంగా అభిమానించే ఈ అమ్మాయి పేరు సుష్మిత. 14 ఏళ్ల ఈ మ్మాయి డౌన్స్ సిండ్రోమ్ అనే జెనిటిక్ డిజార్డర్ తో భాదపడుతోంది. ఆ చిన్నారి చివరి కోరిక తన అభిమాన నటుడు మహేష్ ని కలవడం. ఈ అమ్మాయి అమ్మనాన్న హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా సహాయం తీసుకొని మహేష్ బాబుని కలిపించే అవకాశం ఏర్పాటుచేశారు.
తను ఆరాధించే నటుడు తన కళ్ల ముందు ఉండటంతో ఆ చిన్నారి తన బాధ అంతా మరిచిపోయి చాలా సేపు చాలా ఆనందంగా కాలం గడిపింది అన్న వార్తలు వస్తున్నాయి. తమ అమ్మాయికి ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన మహేష్ కు ఆ అమ్మాయి అమ్మనాన్న ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫోటోను మీడియాకు విడుదల చేసారు.
మహేశ్ బాబుకి పిల్లలు అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. దీనికితోడు 'హీల్ ఏ చైల్డ్' సంస్థకు రెయిన్బో హాస్పిటల్ కు ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు మహేష్. ఈ సంస్థలతో పాటు మరికొన్ని ఎన్జీవో చైల్డ్ ఫౌండేషన్ సంస్థలుకు స్వచ్ఛందంగా మహేష్ పిల్లల ఆరోగ్యం కోసం అదేవిధంగా పేద పిల్లల సంరక్షణ కోసం అనేక ప్రచార కార్యక్రమాలలో పాలుగొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఆ చిన్నారితో ఉన్న ఫోటో మహేష్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com