లోహాల ఫ్యాక్టరీ వద్ద అంగారాలో అగ్నిప్రమాదం
- June 25, 2017
అంగారా: రాజధానికి పశ్చిమాన ఉన్న పారిశ్రామికవేత్త జిల్లాలోని అంగారాలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఉన్న లోహాల ఫ్యాక్టరీ వద్ద పాత సామానులు పడవేసి చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.అక్కడ ఉన్న పలు లోహాలు పెద్ద శబ్దంతో పేలడం ప్రారంభమయ్యింది. అంగారాతో సహా జహ్రా, సులైబికాత్, ఫర్వానీయాలతో కూడిన నాలుగు అగ్నిమాపక విభాగాలు అగ్నిమాపక యంత్రాంగాలు సంఘటనాస్థలం వద్దకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్ర యత్నాలు చేశారు.1,000 చదరపు మీటర్ల వ్యాసార్ధంలో లోహాల ఫ్యాక్టరీ లో విస్తరించిన అగ్నిని నియంత్రించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నిమాపక దళాలు దాదాపు మూడు గంటలు డంప అవుట్లో ఎగిసిపడుతున్న మంటలతో పోరాడాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, యూత్ వ్యవహారాల సహాయ మంత్రి ఖలేద్ అల్-రౌదన్, ఇండస్ట్రీ కోసం పబ్లిక్ అధారిటీ జనరల్ డైరెక్టర్ అబ్దుల్కరిమ్ తక్కి ప్రమాద స్థలానికి హాజరయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు ఏర్పడలేదు.
తాజా వార్తలు
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు









