'కురుక్షేత్రం' తప్పకుండా సక్సెస్ అవుతుంది: అర్జున్

- June 25, 2017 , by Maagulf
'కురుక్షేత్రం' తప్పకుండా సక్సెస్ అవుతుంది: అర్జున్

హైదరాబాద్: అర్జున్ నటిస్తున్న చిత్రం 'కురుక్షేత్రం'. ఆయన తన 36 ఏళ్ల సినీకెరీర్లో నటిస్తున్న 150వ చిత్రమిది. ఈ సినిమా టీజర్ను రామానాయుడు స్టూడియోలో ఆదివారం విడుదల చేశారు. యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లోనూ దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. 'చిత్ర పరిశ్రమకు వచ్చి 36 ఏళ్లు అవుతోంది. 'కురుక్షేత్రం' నా 150వ సినిమా. 'జైహింద్ 2' తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ఇది. బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయకూడదు అనుకున్నా. కానీ కథ నచ్చడంతో చేశాను. ఇప్పటి వరకు 20-30 సినిమాల్లో పోలీసు అధికారిగా నటించా.

కానీ ఆ సినిమాల్లో లేని అంశాలు 'కురుక్షేత్రం'లో చూస్తారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com