వెస్ట్ విండీస్‌పై భారత్‌ ఘనవిజయం

- June 25, 2017 , by Maagulf
వెస్ట్ విండీస్‌పై భారత్‌ ఘనవిజయం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరీబియన్‌ పర్యటనలో భారత్‌ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఓపెనర్‌ అజింక్యా రహానే శతకంతో చెలరేగగా, ధావన్‌, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక యువ బౌలర్‌ కుల్ధీప్‌ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ విండీస్‌పై సునాయసంగా విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. అతడికి తోడు కెప్టెన్‌ కోహ్లి (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా భారత్‌ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు.

భారీ లక్ష్య చేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ పోవెల్‌ భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ను కూడా భువీ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్‌ షై హోప్‌(89) ఒంటిరి పోరాటం చేయగా మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి సహాకారం అందకపోవడంతో నిర్ణీత 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇక భారత్‌ బౌలర్లలో భువీ 2, కుల్దీప్‌ యాదవ్‌ (3), అశ్విన్‌ (1) దక్కాయి. శతక వీరుడు అజింక్యా రహానేకు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ వరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com