గాయపడ్డ సెక్యూరిటీ ఆఫీసర్స్‌ని పరామర్శించిన క్రౌన్ ప్రిన్స్
- June 25, 2017
మక్కా: క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, ఓ ఆపరేషన్‌లో గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బందిని ఆసుపత్రిలో పరామర్శించారు. మక్కాలోని గ్రాండ్ మాస్క్‌ని టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేసే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడటం జరిగింది. ప్రిన్స్ మొహమ్మద్, గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బందితోపాటు, విదేశీ యాత్రీకుల్ని సైతం పరామర్శించారు. ఓ తీవ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. భద్రతా సిబ్బంది త్యాగాలు వృధా పోవనీ, దేశమంతా భద్రతా దళాల వెంట ఉంటుందని ప్రిన్స్ మొహమ్మద్ చెప్పారు. ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షల్ని భద్రతా సిబ్బందికి తెలియజేశారు ప్రిన్స్ మొహమ్మద్. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సౌద్ నైఫ్, కమాండర్ ఆఫ్ స్పెషల్ ఎమర్జన్సీ ఫోర్సెస్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలిద్ బిన్ ఖరార్ అల్ హర్బి పలువురు అధికారులు క్రౌన్ ప్రిన్స్ వెంట ఉన్నారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









