కోనసీమ షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'రంగస్థలం'
- June 26, 2017
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'రంగస్థలం 1985'. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజమండ్రిలోని పలు అందమైన లొకేషన్లలో ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ షూటింగ్ షెడ్యూల్ను తాజాగా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా రామ్చరణ్ గ్రామస్థులను పలకరిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్, సమంత మునుపెన్నడూ ప్రేక్షకులు చూడని విధంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి 'రంగస్థలం 1985'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







