స్విమ్మింగ్ పూల్ లో మునిగి ప్రవాస భారతీయుని మృతి

- June 27, 2017 , by Maagulf
స్విమ్మింగ్ పూల్ లో మునిగి ప్రవాస భారతీయుని మృతి

ఆదివారం మరో ప్రవాస భారతీయుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఊపిరాడక చనిపోయాడు.. జఫ్ఫైర్ లోని ఒక భవనంలో స్విమ్మింగ్ పూల్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి 32 ఏళ్ళ ఖాబీలు అబ్దుల్ జలీల్ గా గుర్తించారు, కుహేజీ కాంట్రాక్టర్స్ డబ్యు.ఐ .ఐ  అనే కంపెనీ వద్ద  సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. స్థానికులు చూసేసరికి ఈత కొలనులో నిర్జీవంగా దొరికినట్లు పేర్కొంటున్నారు. దాంతో తాము వెంటనే ఆసుపత్రికి తరలించాం కానీ  ఆప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారని తెలిపారు. అసలేమీ జరిగిందో ఇప్పటికి మాకు ఇంకా ఏమి తెలియదు. మేము పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. "చట్టబద్ధమైన అన్ని లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఖాబీలు అబ్దుల్ జలీల్ భౌతిక దేహాన్ని ఆయన స్వదేశానికి పంపడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ట్వీట్లో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com