జీఎస్టీ పై వ్యాపారుల నిరసన

- June 27, 2017 , by Maagulf
జీఎస్టీ పై వ్యాపారుల నిరసన

జీఎస్టీ అమలుకు సమయం దగ్గరపడుతున్న కొద్ది వ్యాపార వర్గాల నుంచి నిరసన పెరుగుతోంది. జీఎస్టీతో నష్టం కలుగుతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు మూడు రోజుల బంద్‌కు పిలుపునివ్వగా.. ఫర్నిచర్ వ్యాపారులు కూడా గత రెండ్రోజులుగా ఆందోళనకు దిగారు.

జీఎస్టీని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారుల ఆందోళన ఉద్ధృతమైంది. వస్తు సేవల పన్నులకు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. షాపులు మూసివేసి తమ నిరసనను తెలియజేశారు. బంద్‌ ప్రభావంతో రద్దీగా కనిపించే వీధులన్నీ బోసిపోయాయి. అక్కడక్కడా వ్యాపారులు నల్ల జెండాలతో వ్యాపారులు తమ నిరసనను తెలియజేశారు. కేంద్రం వస్త్రాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర వెంటనే ఈ నిర్ణయాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. .నిర్ణయాన్ని వెనక్కు  తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు. వస్త్రాలపై జీఎస్టీ విధిస్తే వ్యాపారులతో పాటు వినియోగదారులు నష్టపోతారంటున్నారు. జీఎస్టీపై కేంద్రం వెనక్కు తగ్గకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటున్నారు. 

జీఎస్టీ అమలుకు సమయం దగ్గరపడడంతో ఫర్నిచర్ వ్యాపారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఫర్నిచర్ వ్యాపారులు.. 28 శాతం జీఎస్టీతో వ్యాపారం దెబ్బతింటుదని, దానిని 18 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.a

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com