పోలీసులపై అల్లర్లు, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష
- June 28, 2017
మనామ: కజకనాన్ లో పోలీసులపై అల్లర్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. పోలీసు అధికారులపై వీరు వేధింపులకు పాల్పడ్డారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 22 వ తేదీన15 మంది అల్లరిమూకలు హింసకు పాల్పడ్డారు. ఒక రహదారిని నిర్బంధించి రోడ్లపై టైర్లను ఫైర్ బాంబులతో దహనం చేశారు. అంతేకాక ఇద్దరు ఇనుప కడ్డీలు చేతబూని పోలీసులపై దాడి చేశారు. దాడి చేస్తున్న అల్లరిమూకలను పోలీసులు ఎట్టకేలకు అడ్డుకున్నారు .అయినప్పటికీ, ఆ సన్నివేశంలో పోలీసు అధికారులు ముద్దాయిలకు భయపడి పారిపోకుండా నిరోధించగలిగారు. అల్లర్ల కు పాల్పడిన నిందితుల వేలిముద్రలను సేకరించి ఆ నమూనాలతో సరిపోల్చడం ద్వారా ఆయా నేరాలలో వారి పాత్రను ధృవీకరించబడింది. వారి కార్యసాధనను వివరిస్తూ, ముద్దాయిలలో ఒకరు పోలీసులకు ఇలా చెప్పాడు: "నేను షాబాబ్ కజ్రాజాకన్ (కజాకన్ యూత్) అనే పేరు గల వాట్సాప్ సమూహంపై ఒక సందేశాన్ని అందుకున్నాను, అల్లర్లకు పాల్పడవల్సిందిగా సమాచారం వచ్చింది. ఇందుకోసం 3:30 గంటలకు సమావేశం కావాలని కోరుతూ అందులో పేర్కొన్నారు. " నేను సమావేశం స్థలంకు చేరుకున్నాను. మేము టైర్లను రోడ్లపైకి చేర్చడం మొదలుపెట్టాము తరువాత పోలీసు అధికారులపై దాడి చేసాము "అని మొదటి ప్రతివాది చెప్పారు. "మేము దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ , ఈ ఘటనలో మేము దొరికిపోయామని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







