అల్పాహారాన్ని ఉదయం కాకుండా మధ్యాహ్నం తీసుకుంటున్నారా..
- June 28, 2017
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాల్సిన దోశ, ఇడ్లీ, పూరీ ఇలాంటి ఐటమ్స్ ను లంచ్, డిన్నర్‌లలోనూ తీసుకుంటారు కొందరు. కానీ, ఆరోగ్యరీత్యా ఇది మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ అసలు మిస్ కావద్దు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారికి గుండెపోటు లేదా ప్రాణాపాయ ముప్పు 27 శాతం ఎక్కువగా ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ఆకలి బాగా పెరిగిపోతుంది. దీంతో మధ్యాహ్నం లంచ్ పరిమాణం పెరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్ పెరగడానికి దారితీస్తుంది. దీనివల్ల డయాబెటిస్, బ్లడ్ ప్రజర్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తీసుకునే ఆహారం శరీరంలో బ్లడ్ షుగర్ పరిమాణాలు మిగిలిన రోజంతా ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తాయి.
అధిక తీపి, నూనె పదార్థాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయి, ఆ తర్వాత మరింత తక్కువ స్థాయికి తగ్గిపోతాయి. దాంతో మళ్లీ ఎక్కువ ఆకలి వేస్తుంది. ఫలితంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటుకు దారితీస్తుంది. అందుకే శరీరంలో బ్లడ్ షుగర్ ఒకే రీతిలో ఉండేందుకు వీలుగా ఉదయం ఆహారం తీసుకోవడం మంచిది.
సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్, లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రుళ్లు విశ్రాంతి సమయమే కనుక డిన్నర్ స్వల్పంగా ఉండాలి.
ఒకవేళ లంచ్ తక్కువగా, డిన్నర్ ఎక్కువగా తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్నవారు కనీసం డిన్నర్ లో తీసుకునే ఆహారం చాలా తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరు తమ ఆహారంలో కూరగాయలు, సలాడ్ ఎక్కువ తీసుకోవాలి.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







