భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రేసులో వెంకటేశ్ ప్రసాద్?

- June 29, 2017 , by Maagulf
భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రేసులో వెంకటేశ్ ప్రసాద్?

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి పోటీ పెరుగుతోంది. కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మరోమారు దరఖాస్తులు ఆహ్వానించి జులై 9 గడువు తేదీగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రసాద్‌ జూనియర్‌ నేషనల్‌ చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో తన పదవి కాలం పూర్తి కానుండటంతో ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు పంపారట.
రవిశాస్త్రి, ప్రసాద్‌ ఇద్దరికీ టీమిండియా డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. 2007 నుంచి 2009 వరకు టీమిండియాకి బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన ప్రసాద్‌ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకి బౌలింగ్‌ కోచ్‌గా సేవలు అందించాడు. భారత్‌ తరఫున ఆయన 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు. ఇప్పటికే కోచ్‌ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్‌, టామ్‌మూడీ, దొడ్డ గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఉన్నారు. తాజాగా వెంకటేశ్‌ ప్రసాద్‌ కూడా రేసులోకి రావడంతో కోచ్‌ ఎంపిక ఆసక్తికరంగా సాగనుండటం ఖాయంగా కన్పిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com