భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో వెంకటేశ్ ప్రసాద్?
- June 29, 2017
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి పోటీ పెరుగుతోంది. కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మరోమారు దరఖాస్తులు ఆహ్వానించి జులై 9 గడువు తేదీగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రసాద్ జూనియర్ నేషనల్ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో తన పదవి కాలం పూర్తి కానుండటంతో ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు పంపారట.
రవిశాస్త్రి, ప్రసాద్ ఇద్దరికీ టీమిండియా డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. 2007 నుంచి 2009 వరకు టీమిండియాకి బౌలింగ్ కోచ్‌గా పని చేసిన ప్రసాద్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. భారత్ తరఫున ఆయన 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు. ఇప్పటికే కోచ్ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్‌మూడీ, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ ఉన్నారు. తాజాగా వెంకటేశ్ ప్రసాద్ కూడా రేసులోకి రావడంతో కోచ్ ఎంపిక ఆసక్తికరంగా సాగనుండటం ఖాయంగా కన్పిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







