రస్ అల్ ఖైమాలో కారు పై నియంత్రణ కోల్పోయిన వ్యక్తి దుర్మరణం

- June 29, 2017 , by Maagulf
రస్ అల్ ఖైమాలో కారు పై నియంత్రణ కోల్పోయిన వ్యక్తి దుర్మరణం

రాస్ అల్ ఖైమా: గురువారం రాస్ అల్ ఖైమాలో జరిగిన ఒక ట్రాఫిక్ ప్రమాదంలో 55 ఏళ్ల ఎమిరాటీ వ్యక్తి చనిపోయాడు. ఎస్ ఎస్ ఏ గా ఎమిరాటీ బాధితుడిగా గుర్తించిన ఆ వ్యక్తి   తన వాహనంపై నియంత్రణను కోల్పోయిన కారణంగా, రాస్ అల్ ఖైహంలోని అల్ ఫియాహ్హ్ రోడ్ పై అస్తవ్యస్తంగా ప్రయాణిస్తూ  పలుమార్లు మలుపులు తిప్పుతూ ప్రమాదానికి గురయ్యాడు. సంబంధిత వ్యక్తి రోడ్డు ప్రమాదంకు గురైనట్లు గురువారం రాస్ అల్  ఖైమహ్ పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కు  గురువారం ఒక సమాచారం అందింది. రస్ అల్ ఖైమహ్ పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగాడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రోడ్డు ప్రమాదంలో మోటర్ డ్రైవర్ ప్రమాద స్థలం వద్దే  మరణించినట్లు ప్రకటించారు. అధిక వేగంతో కారుని డ్రైవింగ్ చేయడంతో ఆ వాహనం నియంత్రణ కోల్పోయినట్లు తెలిపారు రహదారిపై బోర్లా పడటంతో  కారు డ్రైవర్ మరణంకు దారితీసినట్లు పోలీసు పరిశోధనలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com