తెహ్రిక్‌ ఈ ఆజాదీ జమ్ము అండ్‌ కశ్మీర్‌ సంస్థపై నిషేధం విధించిన పాక్

- June 30, 2017 , by Maagulf
తెహ్రిక్‌ ఈ ఆజాదీ జమ్ము అండ్‌ కశ్మీర్‌ సంస్థపై నిషేధం విధించిన పాక్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు పాకిస్థాన్‌ దిగొచ్చింది. తమ దేశంలోని ఉగ్రవాది హపీజ్‌ సయీద్‌ అండదండలతో నడుస్తున్న తెహ్రిక్‌ ఈ ఆజాదీ జమ్ము అండ్‌ కశ్మీర్‌ సంస్థపై నిషేధం విధించింది. ఈ సంస్థే ప్రస్తుతం జమాత్‌ ఉద్‌ దవాగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2008లో ముంబయిలో పేలుళ్లకు ఈ ఉగ్రవాద సంస్థే మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ప్రోత్సహించరాదని, అలా చేస్తే అంతర్జాతీయ సమాజం తరుపున తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

ఉన్నపలంగా ఉగ్రవాద చర్యలను నిలువరించే చర్యలు తీసుకోవాలని లేదంటే తమ నుంచి సహకారం అందబోదని చెప్పారు. దీంతో పాకిస్థాన్‌ తాజా చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత జనవరిలోనే హఫీజ్‌ సయీద్‌ను గృహ నిర్బందం చేసిన పాక్‌ పోలీసులు అతడిని అరెస్టు మాత్రం చేయకుండా పరిశీలనలో ఉంచారు. అదే సమయంలో జమాత్‌ ఉద్‌ దవాపై కూడా ఓ కన్నేసి ఉంచారు. సయీద్‌పై ఎప్పుడైతే పాక్‌ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని లక్షిత దాడులు చేయించేందుకు జమాత్‌ సంస్థకు సంకేతాలు పంపించినట్లు ఆ మేరకు ఆ సంస్థ ముందుకు కదిలినట్లు తెలిసింది. ఇదే సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడంతో జమాత్‌ ఉద్‌ దవాను నిషేధ సంస్థల జాబితాలో చేర్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com