వైరస్ మూవీ రివ్యూ

- June 30, 2017 , by Maagulf
వైరస్ మూవీ రివ్యూ

తారాగణం : సంపూర్ణేష్ బాబు, వెన్నెల కిషోర్, గీతా షా, నిదిషా తదితరులు
దర్శకత్వం : ఎస్.ఆర్. కృష్ణ.
నిర్మాతలు : సలీం ఎండి, శ్రీనివాస్ మంగళ
సంగీతం : మీనాక్షి, సునీల్ కశ్యప్.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజాగా నటించిన మూవీ వైరస్.. ఈ మూవీపై ఈ బర్నింగ్ స్టార్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు.. ఎస్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ రోజు విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే..
కథ
కిట్టూ(సంపూర్ణేష్ బాబు) ఇంజనీరింగ్ లో టాపర్ గా వచ్చినా ఓ కాఫీ షాప్ లో పనిచేస్తుంటాడు. అతడిలోని టాలెంట్ ను చూసి అనన్య(నిధిషా) మాస్టర్ డిగ్రీ అమెరికాలో చేయమని ప్రొత్సహిస్తుంది.. దీంతో మాస్టర్ డిగ్రీ పొంది మంచి సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే అతడిని అండగా నిలిచిన ఆనన్య ఆత్మహత్య చేసుకుంటుంది.. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకునేందుకు కిట్టూ రంగంలోకి దిగుతాడు.. చివరికీ ఆ మిస్టరీని తెలుసుకున్నాడా..అసలు వైరస్ అంటే ఏమిటి తదితర విషయాలు తెలీయాలంటే ఈ మూవీ చూడాల్సిందే.. 
విశ్లేషణ
ఈ మూవీలో సంపూర్ణేష్ బాబు తనదైన మేనరిజం, యాక్టింగ్ తో మూవీని నడిపించాడు. అలాగే సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది.అయితే కథను ఆకట్టుకునేలా నడపడంలో దర్శకుడు కృష్ణ తప్పటడుగులు వేశాడు.. దీంతో మూవీ దారి తప్పింది.. దీనికి తోడు ఎటువంటి లింక్ లేకుండా పాటలు, హాస్య సన్నివేశాలు రావడం చిరాకు పుట్టిస్తుంది. హీరోయిన్ గా చేసిన గీతషా అందాలకు పరిమితమైంది. కమెడియన్స్ వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వైవ హర్షలు వారి పాత్ర పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. సునీల్ కాశ్యప్ సంగీతం సాదాసీదాగానే ఉంది.. ఈ మూవీని ఓ 20 నిమిషాలు కత్తెర వేయవచ్చు..నిర్మాణ విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. బర్నింగ్ స్టార్ కోసం ఈ మూవీపై ఒకసారి లుక్ వేయవచ్చు..అయితే కాస్త సహనం ఉండాలి.కామంట్ - మంచి కథను ముంచేశారు
రేటింగ్ - 1/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com