కార్ తో మసీదు పై దాడి
- June 30, 2017
ఫ్రాన్స్‌లో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లండన్ తరహాలో ఓ వ్యక్తి వాహనంతో ఓ మసీదుపైకి దూసుకెళ్లాడు. ఆ మసీదుకు రక్షణగా ఏర్పాటుచేసి బారీగేడ్లను, కాంక్రీటు దిమ్మెలను ఢీకొట్టి మరీ ఈ చర్యకు దిగాడు. దీంతో లండన్ తరహా ఉగ్రదాడి అయ్యుంటందని పోలీసులు క్షణాల్లో అప్రమత్తమయ్యారు. అయితే, ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢీకొట్టిన వ్యక్తి వెంటనే అందులో నుంచి దిగి పారిపోగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ముస్లిం పెద్దలు ముమ్మాటికీ కావాలని చేసిన దాడి అని అన్నారు.
ఈ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అది అతడి సొంతవాహనం అని తేలింది. ఉద్దేశ పూర్వకంగా చేశాడా లేక అనూహ్యం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కారణాలు శోధించేందుకు పోలీసులు అతడి ఇంటిని కూడా సోదా చేశారు. ఆ వ్యక్తి 43 ఏళ్ల అమెరికన్‌గా గుర్తించారు. కాగా, వాహనం మసీదు వైపు దూసుకెళ్లిన సమయంలో అతడు మద్యం కూడా సేవించి లేడని తెలిసింది. దీంతో ఇప్పుడు విచారణ అధికారులంతా గందరగోళంలో పడి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లండన్‌లో ఇటీవల ఈ తరహా దాడులు రెండుసార్లు జరగడం, అవి తామే చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకోవడం జరిగిన నేపథ్యంలో ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు అదే కోణంలో అతడిని విచారించనున్నారు. అతడికి లై డిటెన్షన్ పరీక్ష కూడా చేయనున్నారు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







